పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి – బుద్దా వెంకన్న

-

జల్లయ్య హత్యను ఖండించిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న… బాధిత కుటుంబ సభ్యుల పరామర్శకు పల్నాడు బయలుదేరారు. అయితే అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు.. బుద్దా వెంకన్నని హౌస్ అరెస్ట్ చేసారు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని.. హత్యలు చేయమని సీఎం ప్రొత్సహిస్తున్నారని తెలిపారు బుద్దా వెంకన్న. అందుకే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని.. పల్నాడులో ముగ్గురు టిడిపి కార్యకర్తలను చంపేశారు… పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి అని ఫైర్ అయ్యారు.

పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని.. జల్లయ్య మృతదేహానికి‌ నివాళి అర్పించడానికి మేము‌ వెళ్లకుడదా..? అని నిలదీశారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారు… డీజీపీ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలను పాటిస్తున్నారన్నారు. మూడేళ్లు సవాంగును వాడుకుని పంపేశారు… ప్రస్తుత డీజీపీ పరిస్థితి కూడా అంతే అనేది తెలుసుకోవాలని తెలిపారు. జగన్.. ఎవరినైనా యూజ్ అండ్ త్రో గానే చూస్తారు… రాజకీయంగా ఎదుర్కోలేక.. జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి బుద్ధి చెప్పాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news