ప‌వ‌న్ ను హ‌గ్ చేసుకుని అభినందించిన ఎన్టీఆర్‌.. ఎందుకంటే?

-

పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు ప్ర‌త్యేక‌మైన అభిమాన ద‌ళం ఉంది. ఆయ‌న మెడ‌పై చేయి వేశారంటే అభిమానుల‌కు పూన‌కాలే. అలాంటి హీరో చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా వకీల్ సాబ్. ఈ మూవీలో లాయర్ పాత్రలో ప‌వ‌న్ జీవించారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నా.. దాని ఎఫెక్ట్ ప‌వ‌న్ మూవీపై ప‌డ‌లేదు. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ సినిమా హిట్ కావడంతో డైరెక్ట‌ర్‌ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఈ సినిమాలో నందా అనే లాయర్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వకీల్ సాబ్ సినిమాను చూసి పవన్ క‌ల్యాన్‌ను హత్తుకున్నార‌ని చెప్పాడు. వకీల్ సాబ్ సినిమా తార‌క్ కు బాగా నచ్చిందని, అందుకే ఎన్టీఆర్ పవన్ ను హగ్ చేసుకుని ఆ విష‌యాన్ని చెప్పకనే చెప్పార‌ని ప్ర‌కాశ్‌రాజ్ వివ‌రించారు. ఇక ఈ వార్త విన్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news