అఫీషియల్: తలపతి66 అప్‌డేట్ టైమ్ ఫిక్స్..

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్..నటిస్తున్న చిత్రం ‘తలపతి 66’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో భారీ తారాగణమే ఉంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పిక్చర్ అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమా అప్ డేట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ నెల 21న సాయంత్రం 06.01 గంటలకు తలపతి విజయ్ బర్త్ డే సందర్భంగా అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా విజయ్ బ్లాక్ డ్రెస్సులో ఓ బ్యాగ్ వేసుకుని వస్తున్నట్లు పోస్టర్ ట్వీట్ చేశారు. శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విజయ్ కు జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. డెఫినెట్ గా ఈ సినిమా స్టోరి డిఫరెంట్ గా ఉండబోతున్నదని, జనాలందరికీ నచ్చుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news