మనం తరుచుగా వినే జబ్బలు హార్ట్ ఎటాక్, పక్షవాతం, డయబెటీస్, అల్జీమర్స్ ఇవన్నీ తెలుసు.. కానీ మీరు ఎప్పుడూ వినని ఒక వ్యాధి ఉందని మీకు తెలుసా..? చాలా తక్కువ మందికే ఈ వ్యాధి వస్తుంది. కానీ వచ్చిదంటే పరిస్థితి దారుణంగా తయారవతుంది. ఇంకా ఈ వ్యాధికి చికిత్స కూడా లేదట. అదే Ichthyosis వల్గారిస్ అనే వ్యాధి.
దీనినే జెనెటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి వల్ల చనిపోయిన చర్మ కణాలు చర్మం ఉపరితలంపై మందంగా, పొడిగా మారుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిలో చర్మం పాములాగా తయారవుతుంది. దీని లక్షణాలు సాధారణంగా బాల్యంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి. ఇక్తియోసిస్ వల్గారిస్ (Ichthyosis Vulgaris) – ఇది చాలా సాధారణ రకం. శిశువు పుట్టిన మొదటి సంవత్సరంలోనే లక్షణాలను చూపిస్తుంది. చర్మం పొరలుగా, పొడిగా మరియు గరుకుగా అవుతుంది, అరచేతులు మరియు అరికాళ్ళులో చర్మం గట్టిపడటంతో పాటు సాధారణం కన్నా ఎక్కువ గీతాలు కనపడతాయి. మోచేతులు మరియు మోకాళ్ళు ముఖం ఎక్కువగా ప్రభావితం కావు.ఈ వ్యాధికి చికిత్స ఇంకా కనుగొనలేదు కానీ.. ముందుగా తెలిస్తే పరిస్థితిని నియంత్రించడంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
కారణాలు ఏమై ఉండొచ్చు.?
తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యు మార్పులు (జీన్ మ్యుటేషన్లు) ఇక్తియోసిస్ కు కారణమవుతాయట.. కొన్ని సందర్భాల్లో, తల్లిదండ్రులు లోపపూరిత జన్యువు యొక్క వాహకాలుగా (కారియర్స్) ఉంటారు, అంటే వారు లోపాయుక్త జన్యువు కలిగి ఉంటారు, కాని వ్యాధి లక్షణాలు వారికి సంభవించవు. అయితే, తల్లిదండ్రులు ఇద్దరూ వాహకాలుగా ఉంటే, పిల్లలకు ఈ వ్యాధి సంభవిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాల వలన కూడా ఇక్తియోసిస్ వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ మీ చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే డాక్టర్ మాత్రమే పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేయగలరు..ఇది అంటువ్యాధిలా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి చర్మంపై ఏమైనా అసాధారణ మార్పులు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి సమస్య ఏంటి అనేది తెలుసుకోండి.