ఇమ్మాన్యూయేల్ పై.. తన మనసులో మాట చెప్పిన వర్ష.. తెలిస్తే షాక్..!!

-

బుల్లితెరపై బాగా సక్సెస్ అయిన కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం కూడా ఒకటి. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ పేర్లతో వారంలో రెండు రోజులు మాత్రమే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ ఈ షో నుంచి పలువురు సీనియర్ కమెడియన్ లు వెళ్ళిపోగా కొత్తవాళ్లతో అలాగే నెట్టుకొస్తున్నారు మల్లెమాల యాజమాన్యం. ఇందులో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచేందుకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ వంటివి చేస్తూ ఉంటారు. చాలా రోజులుగా సుధీర్ , రష్మీ మధ్య కెమిస్ట్రీ పండించడం జరిగింది. తాజాగా సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఇక రష్మి సుదీర్ జంటకు గుడ్ బై చెప్పేసినట్లుగా తెలుస్తోంది.ఎవరు ఏమి అనుకున్నా పరవాలేదు. ఇమ్ము అంటే నాకు ఇష్టం: వర్ష - SumanTV

ఇక ఇలాగే హైలెట్ అయిన జంటలలో ఇమ్మాన్యూయేల్ – వర్ష జోడీ కూడా ఒకటి. ఈ జంట కి బాగానే స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అందుచేతనే ఇప్పటికే పలు ఎపిసోడ్లో వీరితో కలిసి పలు కార్యక్రమాలు కూడా చేసి టిఆర్పి రేటింగ్ పెంచుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండడంతో వీరిద్దరూ మాట్లాడే మాటలు కూడా వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అనేంతగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఈవెంట్లలో ఏకంగా వీరిద్దరికీ పెళ్లి కూడా చేశారు. ఇక వర్ష బయట కూడా కొన్ని ఇంటర్వ్యూలలో ఇమ్మాన్యూయేల్ గురించి చాలా గొప్పగా చెప్పింది. మేము స్నేహితులం కంటే ఎక్కువ అని చెప్పింది.ఇకపోతే వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అని చాలామందికి డౌట్ కూడా వచ్చింది. అయితే ఈ డౌట్ కాస్త నిజం చేశారు. వీరిద్దరు ఇక తాజాగా రిలీజ్ అయిన జబర్థస్త్ ప్రోమోలో జడ్జిగా ఉన్న ఇంద్రజ స్కిట్ అయిపోయిన తర్వాత సాధారణంగా ప్రేమించుకున్న వాళ్ళ మధ్య అనుమానాలు రావడం సహజమే.. ఎప్పుడైనా మీ మధ్య అటువంటిది వచ్చిందా అని వర్ష ని అడిగారు..ఎవరు ఏమి అనుకున్నా పరవాలేదు. ఇమ్ము అంటే నాకు ఇష్టం: వర్ష - SumanTV

ఇక వర్ష ఇందుకు సమాధానం ఇస్తూ.. నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉంది అంటే అది నా ఇమ్ము మాత్రమే .. ఎవరు ఏమనుకున్నా.. నాకు ఎటువంటి సమస్య లేదు .. వాడు ఏంటి .. ఆ అమ్మాయి ఏంటి.. అది , ఇది , వీళ్ళిద్దరికి అలా ఎలా ఇలా ఎన్ని అనుకున్నా నాకు సమస్య లేదు. ఈరోజు నేను చెబుతున్నా ఇమ్ము అంటే నిజంగా నాకు ఇష్టం అంటూ ఇమ్ము వైపు చూస్తూ తన ప్రేమను బయటపెట్టింది వర్ష.. ఇక స్టేజి మీద నుంచి వెళుతూ మీ అమ్మకు చెప్పు కోడలు వస్తుందని అంటూ ఇమ్మాన్యుయేల్ తో చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది .అయితే ఇమ్మాన్యూయేల్ మాత్రం షాక్ లో ఉండగా అందరూ ఇమ్ము కి కంగ్రాట్స్ కూడా చెబుతారు. మరి వీరి ప్రేమ గురించి పూర్తిగా తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకూ ఎదురుచూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news