సికింద్రాబాద్‌ అల్లర్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు – సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్

-

సికింద్రాబాద్‌ అల్లర్లకు నాకు ఎలాంటి సంబంధం లేదని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. సాయి డిఫెన్స్ అకాడమీ అని రెండు పేర్లు ఒకేలా ఉన్నాయని… నర్సారావు పేట సాయి డిఫెన్స్ అకాడమీ ఆవుల సుబ్బారావు, నేను ఆర్మీలో ఉన్నాం అలాగే నాకు పరిచయమని తెలిపారు.

సలహాలు సూచనలు ఆవుల సుబ్బారావు దగ్గర తీసుకుంటానని.. ప్రస్తుతం నా దగ్గర స్టూడెంట్స్ లేరని స్పష్టం చేశారు. నేను ఈ అకాడమీ ప్రారంభించి నెల రోజులే అవుతుందని.. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ వాట్సప్ గ్రూప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

కేవలం పేర్లు మాత్రమే ఒకేలా ఉన్నాయి, కానీ ఇది బ్రాంచి ఆఫీస్ కాదని.. అగ్నిపథ్ వలన యువత కు నష్టం తప్ప ప్రయోజనం లేదని పేర్కొన్నారు.. నాలుగు సంవత్సరాల కోసం ఆర్మీ కి ఎందుకు వెళ్తారని.. రిటైర్డ్ అయిన వారికే ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అగ్నిపథ్ ని ఆలోచన లేకుండా తీసుకొని వచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news