Oscar Awards 2023 : ఆస్కార్ వేడుకలు స్ట్రీమింగ్ అయ్యే ప్లాట్‌ఫామ్స్ ఇవే

-

ఆస్కార్ అవార్డుల వేడుక సమీపిస్తోంది. సోమవారం జరగనున్న ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‏ డాల్బీ థియేటర్ ఈ వేడుకకు ముస్తాబైంది. ఏటా జరిగే ఈ వేడుకలు ఎంతో స్పెషల్.. కానీ ఈసారి ఇంకాస్త ఎక్కువ స్పెషల్. ఎందుకంటే.. ఈ ఏడాది పోటీలో మన తెలుగు సినిమా ఉంది. దీంతో ఈ అవార్డులపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది.

అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఈ అవార్డు ఫంక్షన్​ మార్చి 12 ఉదయం 8 గంటలకు మొదలు కానుంది.. భారత్​ కాలమానం ప్రకారం సోమవారం.. అంటే 13వ తేదీ ఉదయం 5.30 గంటలకు మనం లైవ్​లో చూడొచ్చు. అయితే ఈ వేడుకలను పలు ప్లాట్‌ఫామ్‌లు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాయి. హులు లైవ్​ టీవీ, యూట్యూబ్​టీవీ, ఏటీ అండ్​ టీ టీవీ , ఫుబో టీవీ సబ్​స్క్రిప్షన్​ ద్వారా ఈ వేడుకను వీక్షించవచ్చు. అయితే కొన్ని ఛానళ్లు ఉచితంగా ట్రయల్స్​ను కూడా అందిస్తున్నాయి. ఏబీసీ.కామ్​ లేకుంటే ఏబీసీ మొబైల్​ యాప్​లో కూడా దీన్ని వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news