
శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న పడి పడి లేచె మనసు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. హను రాఘవపూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కూడా సినీ అభిమానులను ఆకట్టుకున్నది. తాజాగా రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ ప్రేమికుడిలోని మరో కోణాన్ని వెలికితీసింది. ట్రైలర్ ను బట్టి చూస్తే కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది.