PakkaCommercial :’పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కరోనా కరుణిస్తే ఆరోజే వస్తాం !

-

మ్యాచో హీరో గోపిచంద్, రాశీఖన్నా జంటగా తెర‌కెక్కిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ప్ర‌తి రోజు పండ‌గే’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను కొట్టిన విల‌క్షణ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైనా.. ఫ‌స్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ల కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చింది. పక్కా కమర్షియల్ విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

మే 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కరోనా మహమ్మారి కరుణిస్తే కచ్చితంగా అదే తేదీన తాము చిత్రాన్ని విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగును చిత్రబృందం విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news