బాక్సాఫీస్​ వద్ద ‘పఠాన్​’ వసూళ్ల వర్షం.. RRR రికార్డుకు దగ్గరలో..?

-

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై 23 రోజులు అవుతున్నా.. కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత వచ్చిన షారుక్ మూవీ ఇది. పఠాన్ మూవీ ఇప్పటి వరకు  ప్రపంచ వ్యాప్తంగా రూ.976 కోట్ల గ్రాస్​ సాధించిందని  సినిమా నిర్మాణ సంస్థ యశ్​ రాజ్​ ఫిల్మ్స్​ తెలిపింది.

సోషల్​ మీడియా వేదికగా కలెక్షన్ల వివరాలు వెల్లడించింది. ఈ సినిమా 23 రోజుల్లో వరల్డ్​ వైడ్​గా రూ.976 కోట్ల గ్రాస్​ సాధించిందని తెలిపింది. ఇండియాలో రూ.609 కోట్ల గ్రాస్​.. రూ.505 కోట్ల నెట్​ కలెక్షన్లు సాధించిందని పేర్కొంది. అలాగే ఓవర్​సీస్​లో కూడా పఠాన్​ కలెక్షన్లు అదిరిపోయాయి. అక్కడ రూ.367 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్​సీస్​ ‘బాహుబలి-2’ రూ. 510 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డును పఠాన్​ బద్దలకొట్టనుందో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news