ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ పై పూనమ్ కౌర్ ఆగ్రహం..

-

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరిశంకర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. ఆ మూవీ అప్పట్లో ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. మరలా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాధ్ భగత్ సింగ్.. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది తాజాగా విడుదలైన పోస్టర్ సైతం అభిమానుల్ని ఆకట్టుకుంది. కాగా ఈ పోస్టర్ అభ్యంతరంగా ఉందంటూ టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తాజాగా ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ లుక్ చూసిన అభిమానులు మెచ్చుకుంటుండగా మరి కొంతమంది ఈ విమర్శిస్తున్నారు. ఉస్తాధ్ భగత్ సింగ్ టైటిల్ పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉండడమే కారణం. తాజాగా ఈ విషయంపై పూనం కౌర్ ట్విట్టర్ ద్వారా స్పందించింది.

Image

ఈ ట్విట్ లో “మీరు స్వతంత్ర సమరయోధులను గౌరవించకపోయినా పరవాలేదు కానీ వారి గౌరవానికి భంగం కలిగించేటట్టు ప్రవర్తించొద్దని.. ” ట్విట్టర్ ద్వారా పేర్కొంది. పవన్ కళ్యాణ్, హరిశంకర్ పేరు ప్రస్తావించకుండా ఒక చిత్రం ఇటీవలే ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. దాంట్లో భగత్ సింగ్ గారి పేరు ఆ వ్యక్తి కాళ్ళ కింద ఉంది. ఇది నిజంగా భగత్ సింగ్ గారికి జరిగిన అవమానమే అని ఆమె పేర్కొంది. కాగా ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీ లీల నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news