పవన్ 26 మూవీ పై ఆసక్తికర అప్ డేట్….!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం అయి ఉన్నప్పటికీ కూడా, కొద్దిరోజులుగా తన అభిమానులు కోరుతున్న విధంగా అతి త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక పవన్ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా విషయమై ఇటీవల ఒక ప్రకటన కూడా వచ్చింది. బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని, దిల్ రాజు మరియు బోనీ కపూర్ నిర్మాతలుగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు రావడం జరిగింది. అయితే ఈ సినిమా పక్కాగా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.
కాగా ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక ఆసక్తికరమైన వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, పవన్ ప్రధాన పాత్రలో నటించబోయే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు నటి తాప్సి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ లో అమితాబ్ మెయిన్ రోల్ పోషించిన పింక్ సినిమాలో తాప్సి ఒక లీడ్ రోల్ చేసింది. అయితే ఆ సినిమాలో ఆమె తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించడంతో, తెలుగులో కూడా అదే పాత్రకు ఆమెనే తీసుకోవాలని చూస్తుందట సినిమా యూనిట్.
గతంలో దిల్ రాజు బ్యానర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో తాప్సి నటించి ఉండడంతో, దిల్ రాజు సహా దర్శకుడు వేణు శ్రీరామ్ నేడు తాప్సి వద్దకు వెళ్లి తెలుగు వర్షన్ విషయమై ఆమెకు చెప్పడం, అలానే ఆమె కూడా చేయడానికి ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు. అలానే ఈ సినిమాలో పవన్ ప్రక్కన హీరోయిన్ గా మరొక స్టార్ నటి కూడా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అతి త్వరలో లాంఛనంగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అదే రోజున వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. కాగా నేడు ప్రచారం అవుతున్న వార్తలపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది….!!