బ్రేకింగ్‌: ఆదిలోనే టీమిండియాకు షాక్‌.. నిరాశపరిచిన రోహిత్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అబు జాయేద్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. 14 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఒక ఫోర్ సాయంతో 6 పరుగులు చేశాడు.

మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా బ్యాట్స్‌మెన్ వికెట్ల ముందు నిలబడలేకపోయారు. వరుసపెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. షమీ మూడు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.