వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ కి షాక్ ..?

-

అసలు సినిమాలే చేయను అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మనసు మార్చుకొని రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఆయన ఫ్యాన్సే కాదు మిగతా ప్రేక్షకులు తెగ సంబరపడ్డారు. బాలీవుడ్ హిట్ మూవీ అయిన పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ మగువా.. సాంగ్ తో భారీగా అంచనాలు పెరిగాయి. సంక్రాంతి తర్వాత మొదలైన షూటింగ్ శరవేగంగాను జరిపారు.

 

Vakil Sahab | Pawan Kalyan 26th Movie Update | #PSPK26 | Top ...

వాస్తవంగా అయితే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ప్రభూత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆగస్ట్ 15 న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా వీహ్సయంలో బోనీకపూర్ తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తేసిన పెద్ద సినిమాలను ఇప్పట్లో రిలీజ్ చేయకూడని నిర్ణయించుకున్నారట.

ముఖ్యంగా బాలీవుడ్ లో దాదాపు సెప్టెంబర్ వరకు సినిమాలు రిలీజ్ చేసే ఆలోచనలో లేరట మేకర్స్. అందుకు కారణం ఇప్పటికే అక్కడ కేసులు 10 వేలు దాటిపోయాయి. ఇక ఇక్కడ కూడా పెద్ద సినిమాలు రిలీజ్ దాదాపు మరో మూడు నాలుగు నెలల వరకు ఉండవని తాజా సమాచారం. దాంతో ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ ని ఇప్పుడు చేయడం అంత మంచిది కాదని బోనీ కపూర్ దిల్ రాజు కి సూచించారట. దీంతో ఇప్పట్లో వకీల్ సాబ్ కి సంబంధించి ఏ తాజా పోస్టర్స్, టిజర్స్ ..ఇప్పట్లో రావడ లేదని క్లారిటి వచ్చేసింది. ఇది రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి ఆయన ఫ్యాన్స్ కి షాకే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news