మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేచోట కలిస్తే.. అబ్బో ఇక ఆ హంగామా వేరే ఉంటుంది. తానెంతో సూపర్ హీరో అయినా అన్నయ్య తర్వాతే ఎవరైనా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఈరోజు అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఆయన్ను ఆప్యాయంగా కలిశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరపున పోరాట యాత్ర చేస్తున్న పవన్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అన్నయ్య ఇంటికొచ్చి మరి విష్ చేశారు.
ఈ క్రమంలో అన్నదమ్ములు దిగిన పిక్స్ సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి. రాం చరణ్ ఈ పిక్ తన ఫేస్ బుక్ లో పెట్టాడు. నాన్న బర్త్ డే లంచ్.. బాబాయ్ తో నాన్న.. అన్నదమ్ముల అనుబంధం అంటూ ఓ క్రేజీ మెసేజ్ కూడా పెట్టాడు. చిరు, పవన్ ఇలా కలవడం ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. పవన్ తో పాటుగా చిరు ఇంటికి పవన్ భార్య అన్న లెజినోవా కూడా ఉన్నారు. అంతేకాదు ఈమధ్యే వచ్చిన వారసుడు కూడా పవన్ తో పాటు కనిపించాడు.