పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లుక్ ఇదే…! లీక్ అయిన వకీల్ సాబ్ స్టిల్..!

-

Pawan-Kalyan
Pawan-Kalyan

తెలుగు రాష్ట్రాలు కరోనా తాకిడిని తాళలేకపోతున్నాయి..! తెలుగు చిత్ర సీమ అతలాకుతలం అవుతుంది, షూటింగులు లేవు సినిమాలు విడుదల చేసేందుకు ఆస్కారం లేదు, కరోనా వ్యాది నియంత్రించిన తరువాత సినిమాలు విడుదల చేసినా చూడటానికి ప్రక్షకులు ఎవ్వరూ ముందుకు రారు, ఆసక్తి చూపరు. ఇలాంటి సమయంలో సినీ రంగాన్ని కాపాడాలంటే ఓ బ్లాక్ బస్టర్ కథతో ఓ పెద్ద హీరా సినిమా రిలీజ్ అవ్వకతప్పదు. ఆ కేపబులిటీ ఉన్నది అయితే దర్శకుడు దీరుడు జక్కన్న సినిమా ఇండస్ట్రీ పెద్దన్న రాజమౌళికి లేదా కోట్లాది అభిమానులు ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతే తప్ప మిగితా వారికి ఆ కేపబులిటీ లేదంటున్నారు సినీ వర్గ నిపుణులు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ పై మరోసారి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేంత పనే జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమా లోని స్టీల్ లీక్ అయ్యింది.. ఆ స్టీల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతుంది.

pawan kalyan look leaked from vakeel saab movie
pawan kalyan look leaked from vakeel saab movie

హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోసారి తన ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు. ఈసారి ఓ వినూత్నమైన కథతో సోషల్ యాస్పెక్ట్స్ ఉన్న కథ తో కనువిందు చేయబోతున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాభ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన పింక్ సినిమా రీమేక్ లో న్యాయవాది పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ను పెట్టారు ఇప్పటికే మగువా మగువా  అనే సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా పై ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మొత్తం తెలుగు చలన చిత్ర సీమకే భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు చలనచిత్ర సీమను బౌన్స్ బ్యాక్ చేసేది చేయగలిగేది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం లోని కోర్ట్ సన్నివేశం లోని పవన్ కళ్యాణ్ స్టీల్ ఇప్పుడు లీక్ అయ్యింది ఆ స్టీల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా ను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ బాణీలు అందించాడు ముఖ్య పాత్రల్లో అంజలీ, నివేథా థామస్, ప్రకాష్ రాజ్ లు కనిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news