పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఆ డైరెక్ట‌ర్‌తో ఫిక్స్ అయిన‌ట్టేనా..

-

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని కోరుకోని దర్శకుడు ఉండడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయారు. పవన్ కల్యాణ్ తన పూర్తి సమయాన్ని ప్రజా జీవితంలోనే గడుపుతున్నారు. సినీ ప్రపంచానికి దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. సినిమాల గురించి కనీసం ఎక్కడా మాట్లాడటం కూడా లేదు. అయినప్పటికీ పవన్ సినిమా చేయబోతున్నారంటూ అప్పుడప్పుడు వార్తలు ప్రచారమవుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా ఇలాంటి వార్తే మరొకటి వైరల్ అవుతోంది. ఓ కథతో పవన్ కల్యాణ్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మెప్పించారనేదే ఆ వార్త. ఆ కథ పవన్ కు నచ్చిందని… క్రిష్ దర్శకత్వంలో త్వరలోనే పవన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే పవన్, క్రిష్ ల కాంబినేషన్లో కొత్త సినిమా వస్తున్నట్టే. అయితే ఇది ఎంత వరకు నిజమనే విషయం తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news