పవన్ రూటు మారదు…వాళ్ళు మారరు..గోవిందా..గోవిందా..!!!

-

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన వైఫల్యం చవి చూడటానికి ప్రధానమైన కారణం హద్దూపద్దూ లేని వాగుడే అంటూ విశ్లేషకులు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఎన్నికల కంటే ముందుగానే ఈ విషయాన్ని చాలా సార్లు వెల్లడించారు. అర్థం లేని మాటలు, భీకరమైన అరుపులు, పూనకం వచ్చినట్టుగా ఊగిపోవడం ఇవన్నీ రాజకీయాల్లో సక్సెస్ కావని, ప్రజలు పిచ్చోళ్ళు కాదని హెచ్చరికలు చేస్తున్నా సరే పవన్ పట్టించుకోలేదు. తన ఓటమిలో పవన్ పాత్ర సగ భాగం ఉంటే…

మిగతా సగ భాగం తన ఫ్యాన్స్ కి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదంటారు రాజకీయ పండితులు. ఎందుకంటే చింత చెట్టుకు చింత కాయలు మాత్రమే కాస్తాయి అంటారు. గతంలో పవన్ ప్రతీ ప్రసంగంలో ఫ్యాన్స్ కి మద్దతుగా వారు తప్పులు చేసినా సరే భుజాన వేసుకున్నారు. కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందో పవన్ ఊహించి ఉండదు. పవన్ మద్దతుతో రెచ్చిపోయిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేరే పార్టీ నేతలని తిట్టడం గ్రామాలలో, సిటీలలో వారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

దాంతో విసుగు చెందిన ఏపీ జనాలు పవన్ అధికారంలోకి వస్తే ఇలాంటి ఆకతాయిల ఆగడాలు హెచ్చు మీరుతాయని భావించే పూర్తిగా జనసేనని పక్కన పెట్టేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. టీడీపీ సమయంలో  రైతుల భూముల పక్షాన నిలబడని పవన్ ఇప్పుడు రాజధాని అంశాని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

మరో పక్క అభిమానులు ఎక్కడా తగ్గటం లేదు. మళ్ళీ సోషల్ మీడియాలో తమ పైత్యం చూపిస్తున్నారంటూ ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఎవరన్నా విమర్శలు చేస్తుంటే వారిని పరుష పదజాలంతో తిట్టడం పార్టీ భవిష్యత్తుని మళ్ళీ అంధకారంలో నేట్టేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.ఇప్పటికే కోలుకోలేని స్థితిలో ఉన్న జనసేన పార్టీ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఫ్యాన్స్ హడావిడి వల్ల పార్టీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుందనే విషయాన్ని పవన్ గ్రహించక పొతే ఈసారి రాజకీయ సన్యాసం పక్కా అంటున్నారు రాజకీయ పండితులు.

Read more RELATED
Recommended to you

Latest news