‘పింక్’ రీమేక్ కోసం పవన్ ఆ రేంజ్ లో కష్టపడాలట…..!!

-

రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు విరామం పలికి రాజకీయాల్లో బిజీ అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మళ్లీ ఎట్టకేలకు అతి త్వరలో వెండి తెరపై దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఆయన 26 సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన కోర్టు యాక్షన్ డ్రామా బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

 

Che Guevara biopic In Pawan Kalyan

దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో అతి త్వరలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం పవన్ ఒక నెల రోజుల పాటు శారీరక వ్యాయామం, డైటింగ్ తదితరాలను గట్టిగా పాటించనున్నారని, సినిమా మొత్తంలో ఆయన షూటింగ్ పార్ట్ ఒక ఇరవై ఐదు రోజుల పాటు సాగుతుందని సమాచారం. ఇప్పటికే ప్రారంభమైన సినిమా షూటింగ్ లోని కొన్ని సీన్స్ ని ప్రత్యేకంగా వేసిన కోర్ట్ సెట్టింగ్ లో పలువురు ఇతర నటులపై చిత్రీకరిస్తుంది సినిమా యూనిట్. ప్రస్తుతం తన రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్,

 

ఆపై రాబోయే నెల రోజుల సమయాన్ని పూర్తిగా ఈ సినిమా షూటింగ్ కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, సమంత వంటి వారి పేర్లు ఇప్పటికే తెరమీదకు రాగా, సినిమా యూనిట్ మాత్రం ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. మరి అజ్ఞాతవాసి తో ఘోరమైన ఫ్లాప్ ను చవి చూసిన పవన్, తదుపరి తెరకెక్కనున్న ఈ సినిమాతో ఎంత మేర విజయం అందుకుంటారో వేచి చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version