Pawan Kalyan : భగత్ సింగ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే.. ! ఫారెన్ టూర్ కు డైరెక్ట‌ర్!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్నది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ వ‌స్తున్న ఆ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా కాస్త టైమ్ వుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు

పవన్ క‌ళ్యాన్ వ‌రుస సినిమాల‌తో చాలా బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ మూవీ షూట్ కాగానే.. హరి హర వీరమల్లు సినిమా బ్యాలన్స్ వర్క్ ఫినిష్ చేయాలని ఫ్లాన్ లో ఉన్న‌డంట‌. ఆ తరువాతే భగత్ సింగ్ సినిమాను సెట్స్ మీదికి తీసుక‌పోనున్నార‌ట‌.

అందుకే డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కొన్నాళ్లు అమెరికా వెళ్లి రావాలని ఫ్లాన్ వేసుకున్నర‌ట‌. ఇక్కడ ఖాళీగా వుండి చేసే పనేం వుంది..కొన్నాళ్లు అమెరికా వెళ్లి వస్తానని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చూసుకుంటే… 2022 దసరా వ‌ర‌కు భగత్ సింగ్ రెడీ అవుతుందా? అని అనుమానాలు వ్యక్తవువుతున్నాయి. ఈ లోగా రాజకీయ వ్యవహారాల్లో మార్పులు వస్తే మొదటికే మోసం వస్తుంది కూడా.