టికెట్ రేట్ల పెంపు పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

టికెట్ల రేట్ల పెంపు పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. టికెట్ రేట్లు పెంచడం ఎందుకు అంటే.. భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తాం. ఎందరో శ్రమించి ఒక సినిమా తీస్తారు. టికెట్ రేట్లు పెంచితే ప్రబుత్వానికి జీఎస్టీ వస్తుంది. నిర్మాతకు డబ్బులు వస్తాయి. పడిన శ్రమకు ఫలితం ఉంటుంది. టికెట్ రేటు పెంచకుండా బ్లాక్ లో టికెట్ కొంటే ఎవ్వరికో డబ్బులు వెళ్తాయి. ఎంతో కష్టపడి సినిమా తీసిన వారికి ఫలితం దక్కదు. ప్రతీ టికెట్ నుంచి 18 శాతం పన్ను వస్తుందని తెలిపారు.

టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ రావడం వల్లనే ప్రభుత్వం అనుమతిస్తుందని తెలిపారు. ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోయాను. డైరెక్టర్ శంకర్ తీసిన జెంటిల్ మెన్ సినిమాను చెన్నైలో బ్లాక్ లో చూశానని తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను తీస్తారని ఆయన కొనియాడారు. ఈరోజు గేమ్ ఛేంజర్ సినిమాకి పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం అని చెప్పారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news