ఇండియన్ పాలిటిక్స్ లో రియల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ : రామ్ చరణ్

-

ఇండియన్ పాలిటిక్స్ లో రియల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు రామ్ చరణ్.  మొదటిసారి ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేస్తే ఎంత మంది జనాలు వచ్చారో ఇవాళ అంతే జనాలు వచ్చి జనసంద్రం అయింది. డైరెక్టర్ శంకర్ గారు ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అని ఎందుకు పెట్టారో తెలియదు కానీ రియల్ లైఫ్ లో ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్ లోను రియల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

ఇవాళ పవన్ కళ్యాణ్  పక్కన నిలబడినందుకు, ఆయన కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. పవన్ కళ్యాణ్ ని చూసి ఈ పాత్ర రాసుకున్నారు డైరెక్టర్ శంకర్ అని తెలిపారు. SJ సూర్య, అంజలి, నవీన్ చంద్ర, కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news