టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావుది ప్రత్యేక అధ్యాయం – పవన్ కళ్యాణ్

-

 

 

 

మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్….తెలుగు చలన చిత్ర చరిత్రలో దివంగత అక్కినేని నాగేశ్వరరావుది ప్రత్యేక అధ్యాయం అని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సాత్వికాభినయంతో నాగేశ్వర రావు పోషించిన విభిన్నమైన పాత్రలను సినీ ప్రియులు ఎప్పుడూ గుర్తు చేసుకొంటూనే ఉంటారు….ఆ మహా నటుడి శత జయంతి వేడుకలు నేడు మొదలయిన సందర్భంలో మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానని చెప్పారు.

 

ఒక దేవదాసు.. ఒక మజ్ను.. డాక్టర్ చక్రవర్తి.. దసరా బుల్లోడు.. బాటసారి.. విప్రనారాయణ.. భక్త తుకారాం… బాలరాజు.. సీతారామయ్య గారు… ఇలా ఏ పాత్ర, ఏ చిత్రం ప్రస్తావించుకున్నా అక్కినేని నాగేశ్వర రావు అభినయం కళ్ళలో మెదులుతుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 

మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ అక్కినేని అని.. స్వతహాగా నాస్తికత్వాన్ని విశ్వసించినా వెండి తెరపై భక్తి భావనలు పంచే పాత్రల్లో ఒదిగిపోయిన విధానం ఒక నటుడు పాత్రను ఎంతగా జీర్ణించుకోవాలో ఆయన చిత్రాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు.కరుణ రస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైనది.ప్రేమ కథలకు, నవలా చిత్రాలకు చిరునామాగా నిలిచారని కొనియాడారు.కృషి, పట్టుదలతో చలన చిత్రసీమలో అక్కినేని ఎదిగిన క్రమం నవతరానికి మార్గ దర్శనం చేస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news