చుక్కలు చూపిస్తున్న పైరసీ…!

ఈ రోజుల్లో పైరసీ అంటే చాలు స్టార్ హీరోలు కూడా భయపడిపోతున్నారు. కోట్లు పోసి సినిమా తీస్తే ఈ పైరసీ గోల ఏంటీ అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి హీరో సినిమా అయినా సరే సినిమా విడుదల అయిన నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ లో ప్రత్యక్షం అవుతుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఈ పైరసీ మాత్రం సిని పరిశ్రమని ని వదిలిపెట్టడం లేదు. తాజాగా సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలను వెంటాడింది.

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా పైరసీ ఇప్పుడు ఆన్లైన్ లో ఉంది. దీనితో మహేష్ బాబు కూడా కంగు తిన్నారు. అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా ఇప్పుడు పైరసీలో అందుబాటులో ఉంది. దీనితో సినిమా వసూళ్ళ మీద ప్రభావం పడుతుంది. పైరసీలో సినిమాలు చూస్తూ థియేటర్ కి వెళ్ళడం లేదు కొందరు. మహేష్ బాబు ఓ అడుగు ముందుకేసి నో పైరసీ అంటూ క్యాంపైన్ రన్ చేస్తున్నా,

పైరసీ అంటూ ఎన్ని పిలుపులు ఇచ్చినా సరే ఆగడం లేదు. రజని కాంత్ నటించిన దర్బార్ సినిమా అయితే విడుదలైన గంటల వ్యవధిలో ఆన్లైన్ లో ప్రత్యక్షం అయిపోవడం చూసి రజని కాంత్ కూడా ఆశ్చర్యపోయారు. తమిళ్ రాకర్స్‌తో పాటు మరికొన్ని సైట్లపై కూడా ఇప్పుడు సైబర్ పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత పైరసీకి పెద్దగా గ్యాప్ కూడా ఇవ్వడం లేదు.