గుడ్‌న్యూస్‌: భారీగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా ద‌గ్గ‌న బంగారం ధ‌ర ఈ రోజు కూడా త‌గ్గుముఖం ప‌ట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పడిపోయింది. దీంతో పసిడి ధర రూ.38,010కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇంకా భారీగా పతనమైంది. ఈ పసిడి ధర ఏకంగా రూ.600 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,460కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.160 దిగొచ్చింది. దీంతో ధర కేజీకి రూ.49,000కు క్షీణించింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పడిపోయింది. దీంతో ధర రూ.38,800కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.210 క్షీణించింది. దీంతో ధర రూ.40,000కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.160 తగ్గుదలతో రూ.49,000కు పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news