విష్ణుప్రియ మొబైల్ ను సీజ్ చేసిన పోలీసులు

-

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌కు విచారణకు హాజరైంది  యాంకర్, యాక్టర్ విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో భాగంగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణు ప్రియ ఒప్పుకున్నట్లు సమాచారం. సుమారు 15 బెట్టింగ్ యాప్ లను విష్ణు ప్రియ ప్రమోట్ చేశారు. విష్ణు ప్రియ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు పోలీసులు. తాజాగా బెట్టింగ్ యాప్ కేసులో విష్ణు ప్రియ విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ తరువాత మరోసారి విచారించనున్నారు పోలీసులు.

వాస్తవానికి రెండు రోజుల కిందటే విష్ణు ప్రియ విచారణకు రావాల్సి ఉంది. షూటింగ్ ఉందని పోలీసుల అనుమతితో రెండు రోజుల తరువాత ఇవాళ విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ బ్యాంక్ స్టేట్మెంట్స్‌ను పోలీసులు తీసుకున్నారు. మరోవైపు ఆమె మొబైల్ కూడా పోలీసులు సీజ్ చేసారు. లాయర్ తో కలిసి విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్ ల ద్వారా ఎంత వరకు లబ్ది పొందారు. ఎవరు చెబితే యాప్ లను ప్రమోట్ చేశారని పోలీసులు విచారించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news