కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ రాజకీయ చరిత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. బెజవాడ నడిబొడ్డున టీడీపీని ధీటుగా ఎదుర్కొన్న ఏకైక నాయకుడు. బెంజ్ సర్కిల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన మహానేత. అన్నగారికే ముచ్చెమటలు పట్టించిన కాపుముద్దు బిడ్డ. వంగవీటి ఎంట్రీ తో విజయవాడ రాజకీయాలే మారిపోయాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరు హత్యల వరకూ దారి తీసింది. వంగవీటి జీవితంలో సినిమాను మించిన ఫ్యాక్షన్ రాజకీయం ఉంది. ప్రతిపక్షమైనా…అధికార పక్షమైనా వంగవీటి డేరింగ్ ముందు ఒక్కటే. ఇవన్నీ తట్టుకోలేక వంగవీటిని ఎదుర్కోలేక టీడీపీ నాయకులే రంగను మట్టు బెట్టినట్లు చరిత్ర చెబుతుంది. వంగవీటి పేరు చెబితే ఇప్పటికీ బెజవాడ షేకైపోతుంది.
సోషల్ మీడియాలో వంగవీటి పేరిట గ్రూపులే రన్నింగ్ లో ఉన్నాయి. వంగవీటి ప్రోఫైల్ పిక్ తో తమ నేత అంటూ గర్వంగా చెప్పుకునే అభిమానాన్ని సంపాదించారు. అందుకే సంచలనాల రాంగోపాల్ వర్మ వంగవీటి జీవిత కథను సైతం తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఇంకా రంగా పౌరుషాన్ని సరిగ్గా చూపించలేకపోయాడని వంగవీటి అనుచరులు సినిమా రిలీజ్ టైమ్ లో వర్మ పిరికితనాన్ని ఎత్తి చూపారు. అలాంటి బెజవాడ పౌరుషం పాత్రను ఇప్పుడు మెగా స్నిహితుడు, నిర్మాత సురేష్ కొండేటి పోషిస్తున్నాడు. దేవి నేని పాత్రలో తారకరత్న, వంగవీటి పాత్రలో సు రేష్ కొండేటి నటిస్తున్నట్లు తెలిసింది. పక్కా పొలిటికల్ వార్ నేపథ్యంలో సాగే సినిమా.
బెజవాడ రాజకీయాల గురించి మరోసారి సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరో విశేషం ఏంటంటే సురేష్ కొండేటి కాపు వర్గానిచింది చెందినవాడు కాగా, తారకరత్న కమ్మ వర్గీయుడు. ఈ నేపథ్యంలో రెండు పాత్రలు పోటాపోటీగా ఉంటాయని అంటున్నారు. ఈ పాత్ర దక్కడం పట్ల సురేష్ కొండేటి కొద్ది సేటపి క్రితమే సంతోషం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి దేవినేని అనేది టైటిల్. బెజవాడ సింహం అనేది ఉపశీర్షిక. శివనాగు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నాడు.