మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక యాక్షన్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. మొదటి భాగం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల దీనికి సీక్వెల్గా పొన్నియిన్ సెల్వన్-2 కూడా వచ్చింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్-2’ ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే థియేటర్లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారంతా ఓటీటీలోకి వచ్చాక చూద్దామనుకున్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా.. ఇప్పటి వరకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది. అయితే ఇక నుంచి ఈ సినిమాను ఇకపై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరూ ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. విక్రమ్, ఐశ్వర్యరాయ్‌బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.