సీత పాత్రను రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే.. కారణం..?

-

హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీ దత్, స్వప్న సంయుక్తంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం సీతారామం.. ఇక ఈ సినిమా అద్భుత ప్రేమ దృశ్య కావ్యం అని చెప్పవచ్చు. తెలుగు , తమిళ్ , కన్నడ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది. మొదటి షో తోనే ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆగుపించడమే కాకుండా పూర్తిస్థాయిలో ప్రేమను ఆస్వాదించేలా చేస్తోంది. ఇక రష్మిక మందన్న ఈ సినిమాలో కాశ్మీర్ ముస్లిం అమ్మాయి పాత్రలో డ్యూయల్ పాత్రలో నటించి మరింత ఇమేజ్ ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.

మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా.. ప్రముఖ నటి మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఈ చిత్రంలో నటించడం జరిగింది.మృణాల్ ఠాగూర్ కి ఇదే మొదటి తెలుగు చిత్రం కావడం గమనార్హం. ఇకపోతే ఈ హీరోయిన్ పాత్రకు ముందుగా దర్శక నిర్మాతలు పూజా హెగ్డేను సంప్రదించారు. ఆమె కూడా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భారీ బడ్జెట్లో సెట్ లు వేసి, ప్రొడక్షన్ మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో పూజ హెగ్డే కరోనా బారిన పడింది . ఇక అసలే షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో పూజా హెగ్డే ను కాదని మరొక నటిని తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. కరోనా కారణంగా ఒక అద్భుతమైన సినిమాని మిస్ చేసుకుంది పూజా హెగ్డే.

నిజానికి ఇప్పటివరకు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న పూజా హెగ్డే కు ఈ సినిమా ఒక మంచి విజయాన్ని అందించేది. కానీ దురదృష్టవశాత్తు సినిమా మిస్ చేసుకోవడంతో ఆమె అభిమానులు సైతం బాధ వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా విజయం అయి ఉంటే ఆమె కెరియర్ మరింత దూసుకుపోయేది అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news