డేటింగ్ లో పూజ… ఎవరితోనో తెలుసా…?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లో వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కుర్ర హీరోలందరి ఫస్ట్ ఛాయిస్ ఈ బుట్ట బొమ్మే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో ల సరసన నటించి మెప్పించింది ఈ భామ. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశాన్ని కొట్టేసింది. మోహంజుదరో సినిమాలో హృతిక్ రోషన్ తో,చేసిన కానీ ఆ సినిమా హిట్ కాకపోయినా బాలీవుడ్ లో ఎంట్రీకి అవకాశాన్ని ఇచ్చింది.

ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలను తెచ్చిపెట్టింది. అక్షయ్ కుమార్ తో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది పూజా. అంతే కాకుండా వచ్చే ఏడాది తమిళం లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అని సినీ పరిశ్రమ లో టాక్ నడుస్తుంది. రెండు మూడు తెలుగు సినిమాలు చేతిలో వుండగానే ఒక్క పక్క బాలీవుడ్ లోను, మరోపక్క కోలీవుడ్ లోనూ అవకాశాలు క్యూ కట్టాయి.

ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్డే పై తాజాగా డేటింగ్ లో ఉందనే వార్తలు వినిిస్తున్నాయి. సీనియ‌ర్ న‌టుడు వినోద్ మెహ్రా త‌న‌యుడు రోహ‌న్ మెహ్రాతో పూజా హెగ్డే డేటింగ్ లో ఉన్నట్టు సోష‌ల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం పై ఇటు పూజా కానీ, అటు రోహన్ కానీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ 20వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news