ట్రంప్ కి షాక్ ఇచ్చిన మోడీ, ఫోన్ చేసిన రోజే కీలక నిర్ణయం…!

-

హైడ్రాక్సీ క్లోరోక్విన్… ఇప్పుడు ఈ మందు కరోనా వైరస్ ని తగ్గించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం నమ్ముతున్న విషయం. మలేరియా కు వాడే ఈ మందు కరోనా వైరస్ ని సమర్ధవంతంగా తగ్గించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీనితో ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీని కోసం మెడికల్ షాపుల వద్ద బారులు తీరారు. అయితే కొంత మంది అధిక మోతాదులో తీసుకుని ప్రాణాలు కోల్పోయారు.

దీనితో కేంద్రం దీన్ని బాన్ చేసింది. మన దేశం బాన్ చేసింది అనే విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఆ మందును దిగుమతి చేసుకోవాలని భావించి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. బ్యాన్ చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును అమెరికాకు ఇవ్వండని ఆయన విజ్ఞప్తి చేసారు. ట్రంప్ ఈ విషయాన్ని బయటపెట్టారు. భారత్ లో ఈ మందు కరోనాపై దాదాపుగా విజయం సాధించింది అనేది ట్రంప్ నమ్మక౦.

ప్రస్తుతం ఎగుమతిపై, భారత్‌లో అమ్మకాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ఫోన్ చేసిన గంటల్లోనే ఎగుమతి మినహాయింపులను పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో అమెరికా షాక్ అయింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అర్ధం కాలేదు. అయితే మన దేశంలో కేసులు పెరిగే అవకాశ౦ ఉంది కాబట్టే మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news