HBD Pawan: పవన్ కల్యాణ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ఇచ్చారని మీకు తెలుసా?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల ద్వారా ఆయన ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే, నిజానికి పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి టెక్నీషియన్ అవుదామని వచ్చారు. కానీ, హీరోగా సక్సెస్ అయ్యారు. దాంతో అలానే కొనసాగుతున్నారు.

పవన్ కల్యాణ్ కేవలం హీరోగానే కాకుండా సినిమాలోని మిగతా క్రాఫ్ట్స్ పైన కూడా పట్టు సాధించారు. స్వయంగా ఆయన దర్శకత్వం వహించి హీరో గా ‘జానీ ’ సినిమాలో నటించారు. అయితే, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. తన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా పవన్ కల్యాణ్ సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశారు. నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’తో పాటు తను నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాలను పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేశారు పవన్ .

pawan kalyan gudumba shankar power star
pawan kalyan gudumba shankar power star

పవన్ కల్యాణ్ ‘జానీ’ సినిమాతో పాటు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి స్టోరి అందించారు. ఈ క్రమంలోనే ఆయన ‘గుడుంబా శంకర్’ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు జోడీగా మీరా జాస్మిన్ నటించింది. ఇక పవన్ కల్యాణ్ తన సినిమాల్లోని పాటలను డిఫరెంట్ గా విజ్యువలైజ్ చేస్తుంటారు. స్ఫూర్తినిచ్చే పాటలను తన సినిమాల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ సినిమాల్లో ఆయన ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో పాటలన్నీ కూడా మ్యూజికల్ గా హిట్స్ అవుతుంటాయి. పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా పిక్చర్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బర్త్ డే కానుకగా మేకర్స్ ఇవాళ విడుదల చేసిన ప్రోమో అభిమానులకు విశేషంగా నచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news