`ఆదిపురుష్` ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ అదిరింది!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ మేష‌న్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. పిరియాడిక్ ఫిక్ష‌న‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీతో పాటు ప్రభాస్ మ‌రో రెండు పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే.

అందులో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ తెర‌కెక్కించ‌నున్న `ఆదిపురుష్‌` చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రామ‌య‌ణ గాథ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో రూపొందించ‌బోతున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో రావ‌ణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ని ఇప్ట‌పికే ఫిక్స్ చేశారు. హీరోయిన్‌గా సీత పాత్రలో న‌టించే న‌టి కోసం చిత్ర బృందం అన్వేషిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఫ్యాన్స్ సిద్ధం చేస్తున్న ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ సిద్ధం చేసిన ఫ్యాన్‌మేడ్ పోస్ట‌ర్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌భాస్ గెట‌ప్‌కు సంబంధించిన మ‌రో ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఫ్యాన్‌మేడ్ పోస్ట‌ర్ ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్‌ని బాగా ఇంప్రెస్ చేసింద‌ట‌. ఇదే విష‌యాన్ని ఓమ్ రౌత్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించ‌డంతో ఈ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.