యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన స్టిల్ ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 అంటూ ఓ స్టిల్ వదిలారు.
ఆ పోస్టర్ మీద అక్టోబర్ 23 ఉదయం 11 గంటలకు మరో సర్ ప్రైజ్ ఇస్తారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారట. మరి షేడ్స్ ఆఫ్ సాహో స్టిల్ అదరగొట్టగా రేపు రానున్న ఆ సర్ ప్రైజ్ ఏంటా అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న సాహో సినిమా 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.