అప్పుడే ఒప్పుకోవాల్సింది ప్రభాస్ ఇప్పుడు చాలా కష్టం …ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్ ..?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న రేంజ్ గాని స్టార్ డం గాని ఏ హీరోకి లేదని అందరికీ తెలిసిందే. అంతేకాదు బాహుబలి క్రేజ్ తో సాహో’ సినిమాని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన విషయం తెల్సిందే. సాహోకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కంటే సాహో తో వచ్చిన క్రేజ్ పాన్ ఇండియా హీరో రేంజ్ అని చెప్పాలి.

 

Hyderabad: Actor Prabhas Interacted to media on his movie “Saaho” in Hyderabad. (Photo: IANS)

ఇక తాజాగా ప్రభాస్ జాన్ అన్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే సాహో రిజల్ట్ తో జాన్ కి ముందు అనుకున్న బడ్జెట్ లో కొంత తగ్గించారు. ఇది ప్రభాస్ మేకర్స్ కి సూచించిన సలహా. అయితే సినిమాలో రిచ్ నెస్ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా లో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో బ్రేక్ ఇచ్చిన ఈ సినిమాకి ఫారిన్ లో చేయాల్సిన సీన్స్ ని ఇక్కడే సెట్ వేసి టాకీ పార్ట్ కంప్లీట్ చేయబోతున్నారు.

అయితే బాహుబలి ప్రాంఛైజీ తర్వాత బాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో భారీ స్థాయిలో సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాయి. అందులో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కరన్ జోహార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బాహుబలి కన్‌క్లూజన్ తర్వాత ఫ్యాన్సీ రేంజ్ రెమ్యూనరేషన్ ని కూడా ఆఫర్ చేసి ప్రభాస్ ని సంప్రదించారు. కాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయడానికి ఆసక్తిగా లేనంటూ సింపుల్ గా నో చెప్పాడు. బాహుబలి లాంటి మరో భారీ హిట్స్ కొన్ని ఇచ్చాకే నా బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని తేల్చి చెప్పాడట.

ఇప్పటికే బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ రానా కూడా బాలీవుడ్ సినిమా ఒప్పుకోమని చెప్పాడట. అయినా ఎందుకనో ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో నటించాలన్న ఆసక్తిని చూపిస్తున్నారట. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ మేకర్స్ రెడీగా లేరట. అందుకు కారణం ఇప్పటికే వాళ్ళు భారీ ప్రాజెక్ట్స్ లాకవడమే. అయితే ఇది తెలిసిన చాలామంది ప్రభాస్ ఈ డెసిషన్ ఎప్పుడో తీసుకొని ఉండాల్సింది అని అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news