సూళ్లూరుపేటలో ప్రభాస్ మల్టీప్లెక్స్.. దేశంలోనే పెద్దతెర..!

-

స్టార్ హీరోలకు ఈమధ్య మల్టీప్లెక్స్ బిజినెస్ మీద మోజు పెరిగిందని చెప్పొచ్చు. ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ ఏసియన్ శ్రీనివాస్ తో కలిసి ఏ.ఎం.బి సినిమాస్ ను ఓపెన్ చేశాడు. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ లలో భారీ మల్టీప్లెక్స్ గా అధునాతన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించబడింది. మహేష్ దారిలోనే మరికొంతమంది ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈమధ్య ఈ బిజినెస్ గురించి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుండగా లేటెస్ట్ గా ప్రభాస్ కూడా మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు తిరుపతి హైవేలో గల సూళ్లూరుపేటలో ప్రభాస్ మల్టీప్లెక్స్ ఉంటుందట. ఏడున్నర ఎకరాల్లో ఈ థియేటర్ నిర్మాణం జరుగుతుందని తెలుస్తుంది.

మహేష్ ఏ.ఎం.బి సినిమాకు పోటీగా ఈ మల్టీప్లెక్స్ ఉంటుందట. ఇక ఈ థియేటర్ లో స్పెషల్ ఏంటంటే ఒక స్క్రీన్ మాత్రం 106 అడుగుల తెర ఉంటుందట. దేశంలో ఏ థియేటర్ లో ఇంత పెద్ద తెర లేదు. సో ప్రభాస్ థియేటర్ అంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కాబట్టి దేశంలో ఏ థియేతర్ లో లేని స్క్రీన్ ను ప్రభాస్ తెస్తున్నారట. 170 సీటింగ్ కెపాసిటీ కలిగిన 6 థియేటర్స్ తో ఈ మల్టీప్లెక్స్ ఉంటుందట. దీనిలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version