బాలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ కోసం ప్ర‌భాస్ ప్లాన్‌.. రంగంలోకి సిద్ధార్థ్ ఆనంద్!

-

ప్ర‌భాస్ ఇప్పుడు ఆల్ ఇండియాస్టార్ అయిపోయాడు. అన్ని భాష‌ల్లో ఆయ‌న‌కు అభిమానులు ఉన్నారు. అందుకే ప్ర‌తి సినిమాను ప్యాన్ ఇండియా లెవ‌ల్‌లో తీస్తున్నాడు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో త‌న మొద‌టి సినిమాను ఆదిపురుష్ గా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తీస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో రెండో సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నారు.

 

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రెండో సినిమాను చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ ఇప్ప‌టికే వార్‌తో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా కోసం భారీగా ఖ‌ర్చుపెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప్రభాస్ తో చేయబోతున్న సినిమా ను సిద్ధార్థ్ ఆనంద్ వార్ ను మించిన యాక్షన్ మూవీగా తీసేందుకు స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా లో మరో స్టార్ కూడా ఉంటాడని తెలుస్తోంది. వారిద్ద‌రి మ‌ధ్య యుద్ధం ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఆ స్టార్ ఎవ‌రో తెలియాల్సి ఉంది. ఇప్పుడు చేస్తున్న స‌లార్‌, రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్ సినిమాల‌ను వ‌చ్చే ఆరు నెల‌ల్లోకంప్లీట్ చేసి సిద్ధార్థ్ ఆనంద్ సినిమా చేస్తాడు ప్ర‌భాస్‌.

Read more RELATED
Recommended to you

Latest news