విద్యార్థులు, తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. పది, ఇంటర్ పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు ఆయన. అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి లోకేష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహించాలనే మొండి వైఖరి సరికాదు అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
పరీక్షలపై సమీక్షించేందుకు సీఎంకు సమయం లేదు అని ప్రధానికి సమయం దొరికింది గానీ… జగన్‌కు మాత్రం లేదు అంటూ విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని అయన కోరారు. ప్రధాని సమీక్ష తర్వాత సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసింది అని వెల్లడించారు. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుండా వాయిదా వేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.