చుక్క‌ల‌నంటుతోన్న ‘ సాహో ‘ లెక్క‌లు: వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్‌ కొనసాగుతోంది. బాహుబ‌లి సినిమాకు ముందు ఆ ఫీవ‌ర్ దేశాన్ని ఎలా ఊపేసిందో ఇప్పుడు సాహో ఫీవ‌ర్ కూడా అదే రేంజ్‌లో ఊపేస్తోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ యాక్ష‌న్ సినిమాగా తెర‌కెక్కిన సాహోకు రూ.350 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని ప్రభాస్ స్వ‌యంగా చెప్ప‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి.

Prabhas Saaho movie pre release business details
Prabhas Saaho movie pre release business details

రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా ఇప్ప‌టికే సాహో వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ.330 కోట్ల‌కు పైగా జ‌రిగింద‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 125 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌గా… ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లో మ‌రో రూ.46 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ వ‌చ్చాయ‌ట‌.

ఇక సాహో బాలీవుడ్‌లో రూ.125 కోట్ల‌కు అమ్ముడైన‌ట్టు తెలుస్తోంది. ఇక ఓవ‌ర్సీస్‌లో రూ.42 కోట్ల‌కు రైట్స్ అమ్ముడుపోయాయ‌ట‌. ఇక‌ శాటిలైట్‌, డిజిటల్‌, ఆడియో రైట్స్‌ రూపంలో భారీ మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్క‌లు చూస్తుంటే సాహో బాహుబ‌లికి ధీటుగా బిజినెస్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. సినిమాకు యునానిమ‌స్ హిట్ టాక్ వ‌స్తే బాహుబ‌లి రికార్డులు బీట్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు.

యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, మురళీ శర్మ, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించింది.