ఓటీటీ వైపు చూడని ప్రదీప్ మాచి రాజు .. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సాధిస్తున్నాడే ..!

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇన్నాళ్ళు ఆపుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న ప్రదీప్ ఈసారి ఏకంగా హీరోగా 30రోజుల్లో ప్రేమించడం ఎలా? అన్న సినిమాతో సందడి చేయబోతున్నాడు. అంతేకాదు మొదటి సినిమాతోనే డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

 

పీరియాడిక్ అండ్ సోషల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? .. సినిమాలో ప్రదీప్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని ఆ రెండు పాత్రలు ఒకదానికి ఒకటి ఏమాత్రం సంబంధం ఉండదని అంటున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే ఎంత ఆలస్యం అయినా థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడు తప్ప ఛాన్స్ ఉంది కదా అని ఓటీటీ వైపు మాత్రం అసలు చూడటం లేదు.

అయితే తాజాగా ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ తో ప్రదీప్ మరో రికార్డ్ ని సాధించాడు. ఇప్పటికే ఈ సాంగ్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటిపోయిన ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ కి చేరుకొని మరో రికార్డ్ ని నమోదు చేసింది. చిన్న సినిమాగా తయారైన 30రోజుల్లో ప్రేమించడం ఎలా .. రిలీజ్ కాకుండానే ఒకే ఒక్క సాంగ్ తో సంచలనం సృష్ఠిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించగా ఈ సాంగ్ ని స్టార్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడారు. ఇక అల వైకుంఠపురములో తర్వాత సిధ్ శ్రీరామ్ కి మళ్ళీ ఆ రేంజ్ లో క్రేజ్ తీసుకు వచ్చింది ఈ సాంగ్ అనే చెప్పాలి.