అందం ఆకాశన్నంటుతున్న అవకాశాలు మాత్రం రావట్లేదెందుకో..!

సినిమా ఇండస్ట్రీలో కెరీర్ అనేది విజయం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విజయం కోసమే అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఐతే విజయం మాత్రం అందరికీ వచ్చెయ్యదు. దానికోసం చాలా కష్టపడాలి. కష్టం ఒక్కటే సరిపోదు. కొంచెం అదృష్టం కూడా ఉండాలి. ఈ విషయం చాలా మంది నటీనటుల కెరీర్లని చూసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. చాలామంది నటీనటులకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసిరాకే అవకాశాలు సరిగ్గా రావు.

ఆ జాబితాలోకి ప్రగ్యా జైశ్వాల్ కూడా వస్తుంది. కంచె సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకుని, నటనలోనూ, అందంలోనూ ఏమాత్రం తీసిపోని ప్రగ్యా జైశ్వాల్ కి, కంచె తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదనే చెప్పాలి. కంచె సినిమా రిలీజై చాలా రోజులవుతున్నా ఇప్పటికీ కంచె హీరోయిన్ గానే గుర్తింపబడుతుందంటే ఇండస్ట్రీలో ప్రగ్యాకి అవకాశాలు ఏమాత్రం ఉన్నాయో అర్థం అవుతుంది.

అవకాశాలు పెద్దగా రాకపోయినా ప్రగ్యా జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సోషల్ మీడియాలో ఫోటోలని షేర్ చేస్తూ, అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. నలుపు రంగు చీరలో ప్రగ్యా మెరిసిపోతుంది. ఇంత అందం, అభినయం ఉండి కూడా సినిమాల్లో అవకాశలు ఎందుకు రావట్లేదా అని చాలామంది ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.

 

https://www.instagram.com/p/CHR83QcBHQx/?utm_source=ig_web_copy_link