పిక్ టాక్‌: అవ‌కాశం కోసం హ‌ద్దులు దాటేస్తోంది!

హ‌లో షేక్స్పియ‌ర్ అంటూ `కంచె` మూవీతో ఆక‌ట్టుకుంది ప్ర‌త్యా జైస్వాల్‌. క్రిష్ తెర‌కెక్కించిన ఈ ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో హోమ్లీగా క‌నిపించి అల‌రించింది. అయితే ఈ మూవీతో మంచి పేరైతే సాధించింది కానీ ఆశించిన స్థాయిలో అవ‌కాశాల్ని మాత్రం పొంద‌లేక‌పోతోంది. త‌ను న‌టించిన చిత్రాల్నీ తెలుగులో వ‌రుస‌గా ఫ్లాప్ కావ‌డంతో ప్ర‌గ్యాకు ప్ర‌స్తుతం అవ‌కాశాలు రావ‌డం లేదు.

నిన్న‌టికి నిన్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న భారీ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న టాలెంట్‌ని చూపించ‌డం మొద‌లుపెట్టింది ప్ర‌గ్యా జైస్వాల్‌. తొలి మలి చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా న‌టించిన ప్ర‌గ్యా ఆ స్టాంప్‌ని తొల‌గించుకునే ప్ర‌య‌త్నంలో వ‌రుస ఫొటో షూట్ల‌కు పోజులిస్తూ ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది.

తాజాగా గ్లామ‌ర్ డోస్ పెంచేసి ప్ర‌గ్యా జైస్వాల్ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఫొటోల‌కు పోజులిస్తూ అందాలు ప‌రిచిన ఫొటోలు ప్ర‌స్తుతం ఇన్‌స్టాలో సంద‌డి చేస్తున్నాయి. చుర‌క‌త్తుల్లాంటి చూపుల్తో మ‌త్తెక్కించే అందాల‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌గ్యా టాలెంట్‌ని మ‌న వాళ్లు ఇప్ప‌టికైనా గుర్తించి అవ‌కాశాలిస్తారేమో చూడాలి.