సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణీత‌.. ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్‌గా ఉన్న ప్ర‌ణీత కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. పెద్ద హీరోయిన్ కాక‌పోయినా స్టార్ హీరోయ‌న్ల రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉంది ఈ భామ‌కు. ఆమె అందానికి ఫిదా కాని వారే ఉండ‌రు. ఏం పిల్లో.. ఏం పిల్లడో ఎంట్రీ ఇచ్చి.. ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసింది. ఇక అలాంటి ముద్దుగుమ్మ పెళ్లిపై ఇప్ప‌టికే ఎన్నో ఊహాగానాలు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు లాక్‌డౌన్ టైంలో హీరోయిన్ ప్రణీత.. తన ప్రియుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి వేడుక బెంగళూరులోని ప్రణీత నివాసంలోనే జరిగినట్లు తెలుస్తోంది. నితిన్ ఒక బిజినెస్ మ్యాన్‌. ఈ వివాహ వేడుకకు అతి కొద్దిమంది బంధువులు హాజరయ్యారు.

అయితే ఈ పెండ్లి కాస్తా ర‌హ‌స్యంగా జ‌రిగింది. పెద్ద‌గా ఎవ‌రికీ ఇంటిమేష‌న్ ఇవ్వ‌లేదు. కానీ వివాహానికి హాజరైన ఓ సన్నిహితుడు ప్రణీత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. త‌న పెండ్లిపై ప్ర‌ణీత స్పందించింది. తాను, నితిన్ చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్ అని, పెళ్ళితో మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లామ‌ని చెప్పుకొచ్చింది. కొత్త జంట‌కు అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.