ఏపీ లో ఆనందయ్య కరోనా మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు హైకోర్ట్ లో ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ ముందు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఆనందయ్య కంటిలో చుక్కల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం పేర్కొంది. కంటిలో చుక్కల మందు శాంపిల్స్ సేకరించి రెండురోజుల్లో నివేదికను ముందుంచాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్ట్… ఆనందయ్య మందు తయారీకి సబందించి వనమూలికలను ప్రభుత్వమే సమకూర్చలని న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఈ రోజు ఉదయం ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.