‘పృథ్వీరాజ్’ చౌహాన్‌గా అదరగొట్టిన అక్షయ్ కుమార్..ఆసక్తికరంగా ట్రైలర్

-

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా, డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించారు.

12వ శతాబ్దానికి చెందిన గొప్ప యోధుడి కథను విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కించినట్లు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక ఈ పిక్చర్ లో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ నటించింది. ట్రైలర్ లో సుల్తాన్ గా అక్షయ్ కుమార్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నది. సోనుసూద్, సంజయ్ దత్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

యాక్షన్ సీక్వెన్సెస్ గ్రాండియర్ గా తెరకెక్కాయి. తాను ధర్మం కోసం జీవించానని, అవసరమైతే ధర్మం కోసం మరణిస్తానని అక్షయ్ కుమార్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం తెలుగు, హిందీ , తమిళ్ భాషల్లో ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news