అష్టాచమ్మా డైరెక్టర్ తో ప్రియదర్శి సినిమా

-

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నటుడు ప్రియదర్శి. మల్లేశం, బలగం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించి తన సత్తా చాటాడు. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ.. మరోవైపు కమెడియన్గా అలరిస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా హీరో అవతారం ఎత్తుతున్నాడు. ఈ క్రమంలోనే మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపాడు.

దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రూప ప్రియదర్శికి జోడీగా నటిస్తోంది. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతం అందించనుండగా.. పీజీ విందా సినిమాటోగ్రాఫర్గా పని చేయనున్నారు. మరోవైపు ఇటీవలే శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రంలో ప్రియదర్శి నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news