ప్రియాంకా పెళ్లి ఫోటోల రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..!

-

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ప్రియాంకా చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ తో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట పెళ్లి వేడుకలు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. జోధ్ పూర్ లోని రాజకోటలో వీరి వివాహ వేడుక జరుగనుంది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి అటెండ్ అవుతారని తెలుస్తుంది.

ఈ పెళ్లి ఫోటోల రైట్స్ ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసిందట. 2.5 మిలియన్ డాలర్స్ అంటే మన లెక్కలో 18 కోట్ల వెచ్చించి మరి ఈ ఫోటోల రైట్స్ కొంటున్నారట. ఈ మొత్తాన్ని నిక్ అండ్ ప్రియాంకా తమ చారిటీకి ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రియాంకా, నిక్ ల పెళ్లి వేడుక జరుగనుంది.

సాధారణంగా పెళ్లి ఫోటోలకు అసలైతే ఎదురు డబ్బులు పెట్టాలి. కాని సెలబ్రిటీస్ పెళ్లికి ఫోటోల రైట్స్ ఎదురుడబ్బులు తెచ్చి పెడుతుంటాయి. నిక్, ప్రియాంకల పెళ్లి హంగామా ఎలా ఉండనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news