తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది.  ఇక అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అభ్యర్ధుల నామినేషన్ల స్వీకరణకు సోమవారం 11 గంటల నుంచి  19 సాయంత్రం నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 20న నామినేషన్ల  పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌, 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు సిద్దమయ్యారు. ఇక నామినేషన్ల ప్రక్రియతో తెలంగాణలో రాజకీయ పండుగ పల్లెల నుంచి పట్టణాల వరకు కొనసాగనుంది.

  • నామినేషన్ పత్రాల సమర్పణ, నిబంధనలు…
  •  ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు రూ.10 వేలు నామినేషన్ రుసుమును చెల్లించాలి.
  •  నామినేషన్ డిపాజిట్ రూ.10వేలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 5వేలు, తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
  •  నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ వేయడానికి 48 గంటల ముందే జాతీయ బ్యాంక్‌తో తన పేరు మీద ప్రత్యేకమైన ఖాతాను తెరవాలి.
  • ఎన్నికల వ్యయం ఈ ఖాతా నుంచి మాత్రమే నిర్వహించాలి. ఈ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో చిత్రీకరిస్తారు.
  • ప్రతిపాదించే ఓటరు నిరక్షరాస్యులైతే నామినేషన్ పత్రంలో వేలి ముద్రవేస్తే రిటర్నింగ్ ముందు వేలి ముద్ర వేయాలి.
  • కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం-26 నోటరైజ్డ్ అఫిడవిట్‌ను నిర్దేశిత సమాచారాన్ని నింపాలి.
    గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఫారం-ఎ, ఫారం-బి పత్రాలను నవంబరు 19న మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
  •  అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలనున, క్రిమినల్ కేసుల వివరాలను తప్పని సరిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలి.
  •  అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయడానికి ‘ఫారం-2బి’ సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ఉచితంగా పొందవచ్చు. ఒక్కో అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలు దాఖలు చేసే వెసులుబాటు కూడా ఉంది.
  •  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థికి.. పోటీ చేసే నియోజకవర్గ పరిధిలోని ఒక్క ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్ పార్టీ లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అభ్యర్థిని మాత్రం నియోజకవర్గ పరిధిలోని 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.
  •  గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు నామి నేషన్ పత్రంలోని ‘ఫారం-2బి’ పార్ట్ 3లోని ‘సి’ కాలమ్ ఎదురుగానున్న గుర్తులను మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాలి.
  • పోటీ చేసే అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థి కానట్లయితే అతడు నమోదైన నియోజకవర్గంలోని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ సర్టిఫికేట్ ని తీసుకు వచ్చి నామినేషన్‌తోపాటు సమర్పించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news