ట‌క్ జ‌గ‌దీశ్ అనుమానాల‌పై నిర్మాత‌ల క్లారిటీ.. అప్పుడే విడుద‌ల‌!

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఇండ‌స్ట్రీలో ఓ సెప‌రేటు పేరుంది. ఆయ‌న సినిమా అంటేనే స‌రికొత్త క‌థ‌తో వ‌స్తుంద‌ని అంద‌రి న‌మ్మ‌కం. ఇక నాని అంటే మినిమ‌మ్ హిట్ గ్యారంటీ ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఆయ‌న ఈ విష‌యాన్ని నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీశ్ విష‌యంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

 

గ్రాండ్ గా ఆడియో ఫంక్ష‌న్ చేసుకుని, విడుద‌ల చేద్దామ‌నుకునేలోపే సెకండ్‌వేవ్ దెబ్బ‌కొట్టేసింది. దీంతో విడ‌దల‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల‌పై గంద‌ర‌గోళం నెల‌కొంది.

కొంద‌రు ఓటీట‌లో విడుద‌ల అవుతోంద‌ని చెబుతుండ‌గా.. దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఓటీటీలో వ‌స్తుంద‌నే వార్త‌లు అవాస్తవాలని.. నాని సినిమా థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇది థియేటర్ ఎక్సపీరియన్స్ కోసం రూపొందిస్తున్న సినిమా అని నిర్మాత‌లు చెప్పాడు. కొవిడ్ ప్ర‌భావం త‌గ్గాక థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.