రిలీజ్‌కు ముందే చూడొద్దంటూ ఆ సినిమా పై నిర‌స‌న‌… ఏదంటే..?

అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాలు విడుద‌ల‌కు ముందే వివాదాస్పదం అయి రిలీజ్ కు అడ్డంకులు ఏర్ప‌డుతాయి. ఇప్పుడు కూడా అలాంటి సినిమానే వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో అయిన ఫర్హాన్ అక్తర్ అలాగే మునాల్ థాకూర్ క‌లిసి నాయ‌కా, నాయిక‌లుగు చేసిన సినిమా తూఫాన్. వీరిద్ద‌రు చేసిన ఈ మూవీని జులై 16న అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది.

సినిమా/cinema

కాగా రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై సోషల్ మీడియాలో తీవ్ర‌మైన నిరసన తెలుపుతున్నారు నెటిజ‌న్లు. ఇండియాలో ఎవ‌రూ ఈ సినిమాను చూడొద్దంటూ రిక్వెస్టులు పెడుతూ రీ ట్వీట్ల మోత మోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో సోషల్ మీడియాలోని అన్ని యాప్ ల‌లో నిన్న రాత్రి చెలరేగిన ఈ వివాదం ఇంకా ముదురుతోంది.

అందుకు కార‌ణం ఈ మూవీలో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ కాగా హీరోయిన్ మ్రునాల్ రోల్ పేరు డాక్టర్ పూజా షాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పేర్లు పెద్ద వివాదంగా మారాయి. ఇండియాలో మతాంతర కథలను, సినిమాల‌ను ప్రోత్సహించొద్ద‌నే ఉద్ధేశ్యంతో ఇలాంటి సినిమాను సంప్ర‌దాయాల‌కు విరుద్ధమని చాలా మంది చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా గతంలో కేంద్రం తెచ్చిన సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఫర్హాన్ అప్ప‌ట్లో నిర‌స‌న కూడా తెలిపాడు. ఈ కోపంతోనే నెటిజ‌న్లు ఈ సినిమాను ఆపుతున్నార‌ని తెలుస్తోంది. బాయ్ కాట్ ట్రెండ్‏లో సోష‌ల్ మీడియాలో దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు.